కరోనా... ‘స్పుత్నిక్ వి'’ కోసం విపరీతమైన డిమాండ్... రష్యాకు ఆర్డర్ల వెల్లువ

ABN , First Publish Date - 2020-09-22T04:18:58+05:30 IST

ప్రపంచాన్ని సవాల్ చేస్తోన్న కరోనా మహమ్మరిని తుదముట్టించే క్రమంలో తొలి వ్యాక్సిన్ ను రష్యా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సన్(స్పుత్నిక్ వి) పనితీరుకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత లేకపోయినా, ప్రపంచ దేశాలు మాత్రం దీనిపై విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ సరఫరా చేయాలంటూ రష్యాకు వెల్లువెత్తుతున్న ఆర్డర్‌లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

కరోనా... ‘స్పుత్నిక్  వి'’ కోసం విపరీతమైన డిమాండ్... రష్యాకు ఆర్డర్ల  వెల్లువ

మాస్కో : ప్రపంచాన్ని సవాల్ చేస్తోన్న కరోనా మహమ్మరిని  తుదముట్టించే క్రమంలో తొలి వ్యాక్సిన్ ను రష్యా  తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సన్(స్పుత్నిక్ వి) పనితీరుకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత లేకపోయినా, ప్రపంచ దేశాలు మాత్రం దీనిపై విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ సరఫరా చేయాలంటూ రష్యాకు వెల్లువెత్తుతున్న ఆర్డర్‌లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 


'స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ కావాలంటూ రష్యాను సుమారు 20 దేశాలు కోరుతున్నాయి. దాదాపు 120 కోట్ల డోసుల మేర ఆర్డర్లు ఈ క్రమంలో రష్యాకు వచ్చినట్లు అంచనా. కాగా... భారత్ లో 'స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, వ్యాక్సిన్ సరఫరా కోసం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్  తో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాకు చెందిన గమలేయా ఇన్ స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్(ఆర్ డీఐఎఫ్)  తయారుచేస్తోంది.


ఆర్ డీఐఎఫ్ ఈ ఏడాది డిసెంబరు నాటికి 20 కోట్ల డోసుల తయారీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సమాచారం. రష్యాలోనే కాకుండా, భారత్, దక్షిణ కొరియా, బ్రెజిల్, టర్కీ, సౌదీ అరేబియా, క్యూబా, దేశాల్లో కూడా  స్పుత్నిక్  వి'’వ్యాక్సిన్ తయారు కానుంది. ఇంకా మరికొన్ని దేశాలతో  ఒప్పందాలు ఖరారు కావాల్సి ఉంది. కాగా ‘స్పుత్నిక్  వి'’ కోసం రష్యాకు ఇప్పటికే 120 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-09-22T04:18:58+05:30 IST