ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాక్‌తో భారత్ చెడుగుడు!

ABN , First Publish Date - 2020-07-09T04:04:40+05:30 IST

ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఐక్యరాజ్యసమితి వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రపంచ దేశాల వర్చువల్ సమావేశాల్లో భారత్ పాకిస్థాన్‌ను దుమ్ముదులిపేసింది.

ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాక్‌తో భారత్ చెడుగుడు!

న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ప్రపంచ దేశాల వర్చువల్ సమావేశాల్లో భారత్ పాకిస్థాన్‌ను దుమ్ముదులిపేసింది. భారత్‌పై పాక్ తపుడు ప్రచారానికి దిగితోందని దుయ్యబట్టింది. ఇతరులపై నిందలు మోపుతూ విషం చిమ్మే బదులు పాక్‌లోని విచారకరమైన పరిస్థితిని చక్కదిద్దుకోవాలని ముక్కచివాట్లు పెట్టింది. బలోచిస్తాన్, ఖైబర్ పాఖ్‌తూన్‌ఖ్వా ప్రావిన్స్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న మానహక్కుల హననాన్ని పాక్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ సూటి వ్యాఖ్యలు చేసింది. పాక్‌లో మైనారిటీల బలవంతపు మతమార్పిడులను ఈ సమావేశంలో ప్రస్తావించింది. ఓ పద్ధతి ప్రకారం పాకిస్థాన్ నిరంతరంగా మైనారీటలపై వివక్షపూరిత చర్యలకు దిగుతోందని ఆరోపించింది. ఉగ్రవాదానికి కేంద్రం పాక్ అనే భావన ఎందుకు ప్రపంచవ్యాప్తమో ఒకసారి సింహావలోకనం చేసుకోవాలని హితవు పలికింది. 

Updated Date - 2020-07-09T04:04:40+05:30 IST