వీకెండ్స్‌లో లాక్‌డౌన్.. 28 నుంచి పూర్తిగా..

ABN , First Publish Date - 2020-06-26T22:50:50+05:30 IST

దేశాన్ని కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. రోజురోజుకూ ఈ మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో అస్సాం..

వీకెండ్స్‌లో లాక్‌డౌన్.. 28 నుంచి పూర్తిగా..

దిస్‌పూర్: దేశాన్ని కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. రోజురోజుకూ ఈ మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారాంతాల్లో రాష్ట్రమంతటా లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం ఆరోగ్య‌శాఖా మంత్రి హిమంత బిస్వా వెల్లడించారు. అలాగే కామ్‌రూప్ మెట్రోపాలిటన్ సిటీలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఆదివారం నుంచి 14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుడడంతో పలు రాష్ట్రాల్లో మళ్ళీ లాక్‌డౌన్‌లు విధిస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-06-26T22:50:50+05:30 IST