సుదీర్ఘ లాక్‌డౌన్‌తో పట్టణ ఉద్యోగులకు షాక్‌!

ABN , First Publish Date - 2020-04-07T07:54:13+05:30 IST

కరోనా వైరస్‌ మన దేశంలోని వేతన జీవులకు కష్టకాలం తెచ్చిపెట్టింది. దీంతో పట్టణ ప్రాంతాల్లోని మూడో వంతు మంది ఉద్యోగుల ఆదాయం బాగా పడిపోనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌...

సుదీర్ఘ  లాక్‌డౌన్‌తో పట్టణ ఉద్యోగులకు షాక్‌!

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6: కరోనా వైరస్‌ మన దేశంలోని వేతన జీవులకు కష్టకాలం తెచ్చిపెట్టింది. దీంతో పట్టణ ప్రాంతాల్లోని మూడో వంతు మంది ఉద్యోగుల ఆదాయం బాగా పడిపోనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని అసంఘటిత రంగ సిబ్బందికి ఆదాయ, ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం కానున్నాయని కేపీఎంజీ నివేదిక పేర్కొంది. మూడు వారాల లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగిస్తే.. నిత్యావసరాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపింది. పర్యాటక, ఆతిథ్య రంగాల్లో 3.8 కోట్ల ఉద్యోగాలు పోవడంతో పాటు 7.5 కోట్ల సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మూతపడొచ్చని హెచ్చరించింది.

Updated Date - 2020-04-07T07:54:13+05:30 IST