LIVE...లాక్‌డౌన్ సడలింపులతో కేసులు పెరుగుతున్నాయా?

ABN , First Publish Date - 2020-05-24T13:15:05+05:30 IST

LIVE...లాక్‌డౌన్ సడలింపులతో కేసులు పెరుగుతున్నాయా?

LIVE...లాక్‌డౌన్ సడలింపులతో కేసులు పెరుగుతున్నాయా?

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభన ఆగడం లేదు. సరిగ్గా వారం క్రితం రోజుకు మూడు వేలకు పైగా కేసులు నమోదు అయ్యేవి. తర్వాత రోజుకు నాలుగు, ఐదు వేల చొప్పున పెరుగుతూ వచ్చాయి. శుక్రవారం 6,088 కేసులు రాగా, నిన్న(శనివారం) అత్యధికస్థాయిలో 6,654 కేసులు నమోదు అయ్యాయి. ఇదే రికార్డ్. మొత్తంగా కేసులు 1,25,101కి చేరుకున్నాయి. ఈ సమయంలో దేశంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి శాతం 41.39కి పెరిగింది. సోమవారం నుంచి శనివారం వరకు దేశంలో 30వేల కేసులు రికార్డ్ అయ్యాయి. మొత్తం కేసుల్లో 80శాతం ఐదు రాష్ట్రాల్లో, అలాగే 60శాతం ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, థానే నగరాల్లో నమోదు అయ్యాయి. కరోనా కేసుల తీవ్రత పెరుగుతోంది. లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చారు. దేశంలో అన్ని చోట్ల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పరిరక్షణ కొనసాగుతుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ పెరుగుతున్న కరోనా కేసులు మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చేపట్టిన చర్చలో ఎనలిస్ట్ నర్రా శ్రీధర్, వరంగల్ ఎంజీఎం నోడల్ ఆఫీసర్, ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్, పల్మనాలజిస్ట్ డాక్టర్ సూర్యప్రకాశ్ పాల్గొన్నారు. ఈ చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

Updated Date - 2020-05-24T13:15:05+05:30 IST