లాక్ డౌన్ తో లాభమే.. వైరస్‌ను 90శాతం ఆపొచ్చట!
ABN , First Publish Date - 2020-03-26T04:23:38+05:30 IST
వైరస్ లక్షణాలతో ఉన్న వారిని హోం క్వారంటైన్ లో ఉంచడం ద్వారా వ్యాధి వ్యాప్తిని కనీసం 62శాతం నియంత్రించవచ్చని తెలిపింది.

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4లక్షలపైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో పలుదేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. సరిహద్దులు మూసేశాయి. ప్రజలను కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించాయి. ఈ క్రమంలో అసలు ఈ లాక్ డౌన్ వల్ల, ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం వల్ల ఉపయోగం ఉందా? అనే వాళ్లకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సమాధానం ఇచ్చింది. వైరస్ లక్షణాలతో ఉన్న వారిని హోం క్వారంటైన్ లో ఉంచడం ద్వారా వ్యాధి వ్యాప్తిని కనీసం 62శాతం నియంత్రించవచ్చని తెలిపింది. ఇలా సామాజిక దూరం పాటించడం వల్ల.. వ్యాప్తి తీవ్రతను బట్టి 89శాతం వరకు వైరస్ ను అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. కావున దేశవ్యాప్తంగా అమలుచేస్తున్న 21రోజుల లాక్ డౌన్, స్క్రీనింగ్, ప్రయాణాలపై ఆంక్షలు.. వైరస్ కట్టడి ఉపయోగపడతాయని పేర్కొంది.