నెలాఖరు వరకూ ముంబైలో లాక్‌డౌన్?
ABN , First Publish Date - 2020-04-08T21:47:25+05:30 IST
ముంబై నగరంలో కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహా సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు

ముంబై : ముంబై నగరంలో కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహా సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడగించే అవకాశాలున్నాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని సీనియర్ పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ముంబై లాంటి మెట్రో పాలిటిన్ నగరం మాత్రం కరోనాకు ప్రధాన కేంద్రంగా మారిపోయింది.
ఇప్పటి వరకు 782 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 50 మంది మృత్యువాత పడ్డట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ బులిటెన్ విడుదల చేసింది. ఒక్క 24 గంటల్లోనే వంద కరోనా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే ముంబై లాంటి నగరంలో మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడగిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు తెలిపారు. దీంతో ముంబై మహా నగరంలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడగించే అవకాశాలున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.