50 శాతం ప్రయాణికులతో లోకల్ రైళ్ల పరుగులు

ABN , First Publish Date - 2020-11-03T15:56:52+05:30 IST

కోవిడ్-19 కట్టడి నిబంధనలను పాటిస్తూ త్వరలో 50 శాతం ప్రయాణీకుల...

50 శాతం ప్రయాణికులతో లోకల్ రైళ్ల పరుగులు

కోల్‌కతా: కోవిడ్-19 కట్టడి నిబంధనలను పాటిస్తూ త్వరలో 50 శాతం ప్రయాణీకుల సామర్థ్యంతో పశ్చిమ బెంగాల్‌లో లోకల్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. లోకల్ రైలు సేవలను తొలుత 10 నుంచి 20 శాతం ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభించనున్నారు. తరువాత దీనిని నెమ్మదిగా 50 శాతానికి పెంచనున్నారు. అయితే దీనిపై ఈనెల 5న జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా కరోనా కారణంగా పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకూ 6,900 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 59 మంది గడచిన 24 గంటల్లో మృతి చెందారు.


Updated Date - 2020-11-03T15:56:52+05:30 IST