అల్లర్లపై వెంటనే జాబితా సిద్ధం చేయండి: ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం

ABN , First Publish Date - 2020-03-05T00:18:04+05:30 IST

వారం రోజుల క్రితం ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించిన అన్ని విషయాలతో ఓ జాబితాను సిద్ధం చేయించాలని ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశించింది. మార్చి 6న జరిగిన ఈ సంఘటనపై కేసు విచారణను నెల రోజులకు వాయిదా వేయడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పు పట్టింది. ఇది పూర్తిగా

అల్లర్లపై వెంటనే జాబితా సిద్ధం చేయండి: ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం

న్యూఢిల్లీ: వారం రోజుల క్రితం ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించిన అన్ని విషయాలతో ఓ జాబితాను సిద్ధం చేయించాలని ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశించింది. మార్చి 6న జరిగిన ఈ సంఘటనపై కేసు విచారణను నెల రోజులకు వాయిదా వేయడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పు పట్టింది. ఇది పూర్తిగా న్యాయవిరుద్ధమని, అల్లర్లకు సంబంధించిన పూర్తి వివరాలతో వెంటనే జాబితా సిద్ధం చేయండంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. వివాదస్పద వ్యాఖ్యలు చేశారంటూ ముగ్గురు బీజేపీ నాయకులపై వేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 13కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సప్రీం కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.


ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మందికి పైగా గాయపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) అనుకూలంగా వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెండు గ్రూపుల మధ్య ఏర్పడ్డ వివాదం.. ఢిల్లీ అల్లర్లకు దారి తీసింది.

Updated Date - 2020-03-05T00:18:04+05:30 IST