మద్యం హోం డెలివరీకి అనుమతివ్వండి

ABN , First Publish Date - 2020-05-11T07:39:59+05:30 IST

మద్యం హోం డెలివరీకి అనుమతినివ్వాలంటూ పలువురు మద్యం తయారీదారులు, రెస్టారెంట్‌ వ్యాపారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ వల్ల రూ.3వేల కోట్ల మద్యం నిల్వలు పేరుకుపోయాయని...

మద్యం హోం డెలివరీకి  అనుమతివ్వండి

  • 3వేల కోట్ల నిల్వలు పేరుకుపోయాయి : తయారీదారులు


న్యూఢిల్లీ, మే 10: మద్యం హోం డెలివరీకి అనుమతినివ్వాలంటూ పలువురు మద్యం తయారీదారులు, రెస్టారెంట్‌ వ్యాపారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ వల్ల రూ.3వేల కోట్ల మద్యం నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, జొమాటో, స్విగ్గీ, గ్రోఫర్స్‌ వంటి వాటికి ప్రత్యేక లైసెన్స్‌ జారీ చేయాలని ఆల్‌ ఇండియా బ్రూవర్స్‌ అసోసియేషన్‌ సూచించింది. ఆన్‌లైన్‌ అమ్మకాల ద్వారా వ్యాపారుల నష్టం కొంత వరకూ భర్తీ అవుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడు అనురాగ్‌ కత్రియార్‌ కోరారు.


Updated Date - 2020-05-11T07:39:59+05:30 IST