కరోనాతో మాజీ ప్రధాని మృతి

ABN , First Publish Date - 2020-04-06T02:07:17+05:30 IST

రోనా మహమ్మారి బారిన పడి కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న...

కరోనాతో మాజీ ప్రధాని మృతి

కైరో: కరోనా మహమ్మారి బారిన పడి కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న లిబియా మాజీ ప్రధాని మహ్మూద్ జిబ్రిల్(73) ఈరోజు కన్నుమూశారు. కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచి ఆయన ఈజిప్టులోని ఓ ఆసుపత్రిలో మార్చి 27 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజుల నుంచి శ్వాస తీసుకోవడం బాగా కష్టమైపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే ఆదివారం ఆయన తుది శ్వాశ విడిచారు. 


లిబియాలో సివిల్ వార్ జరుగుతున్న సమయంలో జిబ్రిల్ తాత్కాలిక ప్రధానిగా దాదాపు ఒక సంవత్సరం పాటు పనిచేశారు.

Updated Date - 2020-04-06T02:07:17+05:30 IST