కలిసి నడుద్దాం! ‘తెలుగు’వారి బలం చూపుదాం

ABN , First Publish Date - 2020-03-08T16:20:55+05:30 IST

తమిళనాడులో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న తెలుగు ప్రజలందర్నీ సంఘటితపరచి పాలకులకు తమ బలాన్ని చూపే దిశగా అఖిల భారత

కలిసి నడుద్దాం! ‘తెలుగు’వారి బలం చూపుదాం

చెన్నై(ఆంధ్రజ్యోతి): తమిళనాడులో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న తెలుగు ప్రజలందర్నీ సంఘటితపరచి పాలకులకు తమ బలాన్ని చూపే దిశగా అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్‌) కృషి చేస్తోందని ఏఐటీఎఫ్‌ అధ్యక్షుడు సీఎంకే రెడ్డి పేర్కొన్నారు.  నివారం టి.నగర్‌లోని ఆంధ్ర సోషల్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ (ఆస్కా) ప్రాంగణంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన తెలుగు నాయకులతో సమా వేశం జరిగింది.  చెన్నై సహా 15 జిల్లాల నుంచి నాయుడు, రెడ్డియార్లు, ఆదిఆంధ్రులు, వైశ్యులు, బ్రాహ్మణులు సహా 20 కమ్యూనిటీలకు చెందిన తెలుగు నాయకులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ఆ సందర్భంగా సీఎంకే రెడ్డి మాట్లాడుతూ, తెలుగు వారందరూ ఐక్యతగా ఉండి, వచ్చే ఎన్ని కల్లోపు మన బలాన్ని చూపగలిగితే రాజకీ యంగా ప్రాధా న్యత పెరుగుతుందని, తద్వారా భాష, ఇతర సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.  ‘‘మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడైనా తెలుగు వారి బలం చూపించగలిగితే రాజకీయాల్లో మనకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని తెలుగు కమ్యూనిటీ నాయకులతో భాషా సమస్యలపై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిద్దామని పిలుపు నిచ్చారు జనగణన కరెక్టుగా ఉండడం లేదన్న విషయం మా దృష్టికి వచ్చిందని, గణన ఖచ్చితంగా ఉంటే మన సంఖ్యాబలం పాలకులకు తెలుస్తుందని, ఇక తెలుగు అకాడమీ, తెలుగు సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు, దిగ్గజ తెలుగు నాయకులకి చెన్నైలో విగ్రహాలు ప్రతిష్టించాలని, పారిశుద్ధ్య సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ కొన్ని తీర్మానాలు చేసినట్టు తెలిపారు.. ముఖ్యంగా రాష్ట్రంలో తెలుగు మహా నాడు ఏర్పాటుచేయాలన్న ఆలోచన కూడా ఉంది. ఆ మహానాడుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని ఆహ్వానించాలని భావిస్తున్నాం. ఆయన వస్తే తమిళనాడులో తెలుగు సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం ఉంది. అలాగే ప్రధాని మోదీ జాతీయ విద్యా విధానాన్ని తీసుకురాబోతున్నారు. ప్రతి రాష్ట్రంలో మూడు భాషలు తప్పనిసరి. అది వస్తే తెలుగు భాష సమస్యకు పరిష్కారం లభించినట్లే. ముందుగా రాష్ట్రంలో తెలుగువారి బలాన్ని పాలకులు గుర్తించేలా చేయాలి. అందుకే తెలుగు నాయకులందరూ కలిసి కట్టుగా ప్రజల్ని ముందుకు నడిపిస్తే రాజకీయంగానూ ప్రాధాన్యత పెరుగుతుంది. అప్పుడు మన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ సమావ ేశంలో తమిళనాడు నాయుడు పేరవై అధ్యక్షుడు గుణ, జయ విద్యాసంస్థల అధినేత కనకరాజ్‌, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్‌ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ, టామ్స్‌ వ్యవస్థాపకులు ఇజ్రాయేలు, వైశ్య ప్రముఖులు నారాయణగుప్తా, ఏఐటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి నంద గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-08T16:20:55+05:30 IST