మ్యాన్ ఈటర్ చిరుతపులిని కాల్చి చంపారు...
ABN , First Publish Date - 2020-12-19T14:03:06+05:30 IST
మహారాష్ట్రలో 8మందిని చంపిన మ్యాన్ ఈటర్ చిరుతపులిని షోలాపూర్ జిల్లాలో అటవీశాఖ అధికారులు కాల్చి చంపారు....

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలో 8మందిని చంపిన మ్యాన్ ఈటర్ చిరుతపులిని షోలాపూర్ జిల్లాలో అటవీశాఖ అధికారులు కాల్చి చంపారు. కర్మల తహసీల్ పరిధిలోని బితార్‌గావ్ గ్రామానికి సమీపంలోని అరటి తోటలో చిరుతపులిని కాల్చి చంపినట్లు అటవీశాఖ డివిజనల్ ఫారెస్టు కన్జర్వేటర్ ధైర్యశీల్ పాటిల్ చెప్పారు. మ్యాన్ ఈటర్ చిరుతపులి షోలాపూర్, బీడ్, అహ్మద్ నగర్, ఔరంగాబాద్ జిల్లాల్లో 8మందిని చంపింది. చిరుతపులి దాడిలో మరో నలుగురు గాయపడ్డారు. కర్మలాలోి 9 ఏళ్ల బాలికను చిరుతపులి చంపిన ఘటన తర్వాత దీన్ని చంపాలని అధికారులు ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం అరటితోటలో చిరుతపులిని అదుపులోకి తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో దాన్ని కాల్చి చంపామని అటవీశాఖ అధికారి ధైర్యశీల్ చెప్పారు. చిరుతపులి వేట కోసం స్టేట్ రిజర్వు పోలీసు ఫోర్సు, అటవీశాఖ అధికారుల బృందాలను రంగంలోకి దించామని, ఎట్టకేలకు చిరుతను మట్టుపెట్టామని అధికారి ధైర్యశీల్ వివరించారు.