మద్యపానానికి అర్హత వయసును తగ్గించండి : కేజ్రీవాల్ ప్రభుత్వానికి సలహా
ABN , First Publish Date - 2020-12-30T21:24:25+05:30 IST
మద్యం సేవించేందుకు అర్హత వయసు తగ్గింపు, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో

న్యూఢిల్లీ : మద్యం సేవించేందుకు అర్హత వయసు తగ్గింపు, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో బీర్, వైన్ అమ్మేందుకు అనుమతులివ్వడం, ఢిల్లీవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని లిక్కర్ స్టోర్స్‌ను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ కమిటీ సలహా ఇచ్చింది. ఎక్సయిజ్ ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలను సూచించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
ఓ ప్రభుత్వాధికారి తెలిపిన వివరాల ప్రకారం, మద్యం సేవించేందుకు చట్టబద్ధ అర్హత వయసును 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలని, సంవత్సరానికి మూడు డ్రై డేస్ మాత్రమే ఉండాలని, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో బీర్, వైన్ అమ్మేందుకు అనుమతులు ఇవ్వాలని ఈ కమిటీ సూచించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని లిక్కర్ స్టోర్స్‌ను ఢిల్లీ వ్యాప్తంగా సమానంగా పంపిణీ చేయాలని తెలిపింది. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి మాత్రమే డ్రై డేస్‌గా ఉండాలని పేర్కొంది.
ఢిల్లీ రాష్ట్ర ఆర్థిక, ఎక్సయిజ్ శాఖల మంత్రి మనీశ్ శిశోడియా సెప్టెంబరులో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.