కేరళ స్థానికంలో దూసుకెళ్తున్న ఎల్‌డీఎఫ్
ABN , First Publish Date - 2020-12-17T07:56:39+05:30 IST
కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలక ఎల్‌డీఎఫ్ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. కడపటి వార్తలందేసరికి 941

తిరువనంతపురం, డిసెంబరు 16: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలక ఎల్‌డీఎఫ్ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. కడపటి వార్తలందేసరికి 941 పంచాయతీలకు 520 చోట్ల, 14 జిల్లాలకు పది జిల్లాల్లో, 152 బ్లాక్ పంచాయతీలకు 108 చోట్ల, 85 మున్సిపాలిటీల్లో 35 చోట్ల ఆధిక్యంలో ఉంది.
వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల విజయం ఎల్‌డీఎ్‌ఫకు ఎంతో ఊరటనిచ్చింది.