సుశాంత్ కేసు.. ఎన్‌సీబీ అధికారులతో డ్రగ్స్ సరఫరాదారు లాయర్ వాగ్వివాదం

ABN , First Publish Date - 2020-09-06T01:32:13+05:30 IST

మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన సుశాంత్ గాళ్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరండాలను కోర్టు ఈ

సుశాంత్ కేసు.. ఎన్‌సీబీ అధికారులతో డ్రగ్స్ సరఫరాదారు లాయర్ వాగ్వివాదం

ముంబై: మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన సుశాంత్ గాళ్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరండాలను కోర్టు ఈ నెల 9 వరకు ఎన్‌సీబీ కస్టడీకి ఆదేశించింది. అలాగే, ఇదే కేసులో అరెస్ట్ అయిన కైజెన్ ఇబ్రహీంకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. కోర్టు బయట ఎన్‌సీబీ బృందం, కైజెన్ లాయర్‌కు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్‌సీబీ అధికారులు కైజెన్‌ను కారులో తీసుకెళ్తుండగా అతడి లాయర్ అడ్డుకున్నాడు. దీంతో ఎన్‌సీబీ అధికారులకు, లాయర్‌కు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.


డ్రగ్ ట్రాఫికర్లు, పెడ్లర్లను విచారించిన ఎన్‌సీబీ 12 మందికిపైగా మాదకద్రవ్యాల సరఫరాదారులను గుర్తించింది. డ్రగ్ సరఫరాదారు అయిన అబ్దెల్ బాసిత్ పరిహార్‌ నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. జైద్ విలత్రా నుంచి అతడు డ్రగ్స్ తీసుకుని సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరండాకు సరఫరా చేసినట్టు విచారణలో వెల్లడైంది.  

Updated Date - 2020-09-06T01:32:13+05:30 IST