విజయ్ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీ ఛార్జ్.. నైవేలిలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2020-02-08T03:27:03+05:30 IST
తమిళ టాప్ హీరో విజయ్ అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఆయన సినిమా ప్రస్తుతం నైలేలిలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, విజయ్ సినిమా షూటింగ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. బీజేపీ కార్యకర్తల

తమిళ టాప్ హీరో విజయ్ అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఆయన సినిమా ప్రస్తుతం నైలేలిలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, విజయ్ సినిమా షూటింగ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. బీజేపీ కార్యకర్తల చర్యలపై విజయ్ అభిమానులు ధర్నాకు దిగారు. షూటింగ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనంతో విజయ్ అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. నైలేలిలోని గనుల్లో విజయం సినిమా షూటింగ్ జరుగుతోంది. గనుల్లో సినిమా షూటింగ్‌లకు అనుమతులు లేవని ఇక్కడ సినిమా ఎలా చిత్రీకరిస్తారని చిత్ర బృందంపై బీజేపీ కార్యకర్తలు ప్రశ్నల వర్షం కురిపించారు. అంతే కాకుండా విజయ్ సినిమాను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న విజయ్ అభిమానులు నైలేలి చేరుకున్న అభిమానులు.. బీజేపీ తీరుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు.
ఒక వైపు బీజేపీ కార్యర్తలు ఆందోళన, మరో వైపు విజయ్ అభిమానుల ధర్నా.. నైలేలి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసలు ఇరు వర్గాల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితులు దరికి రాకపోవడంతో విజయ్ అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న విజయ్.. వెంటనే అక్కడికి వచ్చి అభిమానులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.