కరోనా టెస్టులయ్యాకే కొత్త సంవత్సర వేడుకలు

ABN , First Publish Date - 2020-12-10T17:10:20+05:30 IST

కరోనా కాలంలో ఉత్తరాఖండ్‌లోని పర్యాటక ప్రాంతాలైన మసూరీ, నైనిటాల్ మొదలైన ప్రాంతాల్లో...

కరోనా టెస్టులయ్యాకే కొత్త సంవత్సర వేడుకలు

డెహ్రాడూన్: కరోనా కాలంలో ఉత్తరాఖండ్‌లోని పర్యాటక ప్రాంతాలైన మసూరీ, నైనిటాల్ మొదలైన ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మసూరీలోని హోటళ్లలో 40 శాతం వరకూ బుకింగ్స్ ఇప్పటికే అయ్యాయి. మరోవైపు మసూరీ, నైనిటిల్‌లకు వచ్చే పర్యాటకులకు కరోనా టెస్టులు చేసిన తరువాతే ప్రవేశం కల్పిస్తారు. అయితే దీనిపై ఇంకా హైకోర్టు నుంచి ఆదేశాలు రావాల్సివుంది. తాజాగా మసూరీలో 151 మందికి కరోనా టెస్టులు చేయించగా, వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఇదేవిధంగా పర్యాటక స్థలాల్లో మాస్క్ లేకుండా తిరుగుతున్నవారికి పోలీసులు చలానాలు విధిస్తున్నారు.  స్థానిక వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ రాణా మాట్లాడుతూ మూసూరీలో ప్రతీరోజూ కోరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకూ ఈ ప్రాంతంలో 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు.  కాగా ఇక్కడి హోటళ్లలో డిసెంబరు 25 నుంచి 31 వరకూ బుకింగ్స్ జరుగుతున్నాయి.

Updated Date - 2020-12-10T17:10:20+05:30 IST