ఇయర్‌ఫోన్ పెట్టుకుని రైల్వే పట్టాలపై ఇద్దరు యువకులు... కొద్దిసేపటికే 50 ముక్కలైన శరీరాలు!
ABN , First Publish Date - 2020-11-21T17:13:37+05:30 IST
two boys walking railway track earphones ears train accident

బుర్హాన్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కర్నాటక ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందారు. వీరి శరీరాలు 50 ముక్కలుగా మారి, రైల్వే ట్రాక్‌కు సుమారు వంద మీటర్ల దూరం వరకూ కనిపించాయి. వీటిని గమనించిన స్థానికులు రైల్వేట్రాక్ వద్దకు చేరుకుని మూడు గంటల పాటు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ రూటులో నిడిచే రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి.
వివరాల్లోకి వెళితే బిరోదాకు చెందిన 19 ఏళ్ల ఇర్ఫాన్, 16 ఏళ్ల కలీమ్ స్నేహితులు. వారిద్దరూ సాయంత్రం 6 గంటల సమయంలో రైల్వే ట్రాక్‌పై నడుస్తున్నారు. ఈ సమయంలో వారు చెవులలో ఇయర్ ఫోను పెట్టుకుని ఏదో వింటున్నారు. ఇంతలో వారు ఊహించని విధంగా అటుగా వచ్చిన కర్నాటక ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొంది. దీంతోవారు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాద వివరాలను రైలు డ్రైవర్ ఉన్నతాధికారులకు తెలియజేశాడు. ఘటన జరిగిన సమయంలో తాను హారన్ మోగించినప్పటికీ, వారు వినలేదని డ్రైవర్ అధికారులకు తెలిపాడు. ఈ కారణంగానే ప్రమాదం జరిగిందన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
