తమిళనాడు, కర్ణాటకలో ఇవాల్టి కరోనా కేసుల తాజా అప్ డేట్

ABN , First Publish Date - 2020-06-24T01:32:53+05:30 IST

దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కల్లోలం రేపుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు...

తమిళనాడు, కర్ణాటకలో ఇవాల్టి కరోనా కేసుల తాజా అప్ డేట్

చెన్నై/ బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కల్లోలం రేపుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇవాళ కూడా తమిళనాడులో 2,516 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా మరణాలు కూడా తమిళనాడు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే తమిళనాడులో 39 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో.. తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య 833కు చేరింది.


కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,603కు చేరింది. తమిళనాడులో కరోనా నుంచి కోలుకుని మంగళవారం ఒక్కరోజే 1,227 మంది డిశ్చార్జ్ అయినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇక.. కర్ణాటకలో కూడా మంగళవారం కొత్తగా 322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో కొత్తగా 8 మంది కరోనా సోకి మరణించారు. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9721కు చేరగా.. కరోనా మరణాల సంఖ్య 150కు చేరింది.

Read more