పచ్చని పరిసరాల్లో నివసించే మహిళల్లో ఆలస్యంగా మెనోపాజ్‌

ABN , First Publish Date - 2020-02-16T07:44:21+05:30 IST

పచ్చని పరిసరాల నడుమ జీవించే మహిళల్లో మెనోపాజ్‌ ఆలస్యంగా వస్తుందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. 2వేల మంది మహిళల ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనం అనంతరం వారు ఈవిషయాన్ని వెల్లడించారు. ఇతర మహిళలతో పోల్చితే.. మొక్కలు, చెట్లతో కూడిన ఆహ్లాదకర వాతావరణంలో నివసించే మహిళల్లో

పచ్చని పరిసరాల్లో నివసించే మహిళల్లో ఆలస్యంగా మెనోపాజ్‌

లండన్‌, ఫిబ్రవరి 15 : పచ్చని పరిసరాల నడుమ జీవించే మహిళల్లో మెనోపాజ్‌ ఆలస్యంగా వస్తుందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. 2వేల మంది మహిళల ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనం అనంతరం వారు ఈవిషయాన్ని వెల్లడించారు. ఇతర మహిళలతో పోల్చితే.. మొక్కలు, చెట్లతో కూడిన ఆహ్లాదకర వాతావరణంలో నివసించే మహిళల్లో 1.4 ఏళ్లు ఆలస్యంగా మెనోపాజ్‌ వస్తోందని గుర్తించారు. వారికి సగటున 51.7 ఏళ్ల వయసులో మెనోపాజ్‌ వస్తుండగా, ఇతర మహిళల్లో 50 ఏళ్లకే ఆ దశ వస్తోందన్నారు. సాధారణంగా మనిషి ఒత్తిడికి గురైనప్పుడు అడ్రినల్‌ గ్రంధులు కార్టిజాల్‌ అనే హార్మోన్‌ను రక్తంలోకి విడుదలచేస్తాయి. హరిత పరిసరాల నడుమ జీవించే మహిళల్లో మానసిక ఒత్తిళ్లు తక్కువగా ఉన్నందున కార్టిజాల్‌ విడుదలయ్యే మోతాదు తగ్గి, సెక్స్‌ హార్మోన్‌ ఎస్ట్రాడియాల్‌ మోతాదు పెరిగిందని విశ్లేషించారు. ఫలితంగా మెనోపాజ్‌ రాక ఆలస్యమవుతోందన్నారు. 

Updated Date - 2020-02-16T07:44:21+05:30 IST