దీపావళి రోజు రాత్రి 10 గంటలకు చివరి రైలు సర్వీసు: ఢిల్లీ మెట్రో
ABN , First Publish Date - 2020-11-14T01:30:51+05:30 IST
దీపావళి రోజు రాత్రి 10 గంటలకు చివరి రైలు సర్వీసు: ఢిల్లీ మెట్రో
న్యూఢిల్లీ: దీపావళి పండుగ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం దీపావళి సందర్భంగా అన్ని మార్గాల టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి ఢిల్లీ మెట్రో రైలు సర్వీసులు రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొంది.
సాధారణంగా ప్రతిరోజూ చివరి రైలు సర్వీసు చాలా టెర్మినల్ స్టేషన్లలో రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. అన్ని మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచి మిగిలిన రోజులలో రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు.