మెరిట్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు
ABN , First Publish Date - 2020-07-27T15:32:23+05:30 IST
విద్యార్థులకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీపి కబురు చెప్పారు.....

భోపాల్ (మధ్యప్రదేశ్): విద్యార్థులకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీపి కబురు చెప్పారు. 12వతరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లను అందించాలని నిర్ణయించినట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. కరానా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీనియర్ అధికారులతో మాట్లాడారు. మెరిట్ విద్యార్థులు ల్యాప్ టాప్ ల కొనుగోలుకు వీలుగా 25వేల రూపాయలు అందించాలని సీఎం ఆదేశించారు. 2019-20 విద్యాసంవత్సరంలో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందిస్తామని సీఎం చెప్పారు.