చైనాలో విరిగిపడిన కొండచరియలు.. 9 మంది సజీవ సమాధి..
ABN , First Publish Date - 2020-07-08T19:01:51+05:30 IST
చైనాలోని హుబై ప్రావిన్స్‌లో కుండపోత వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడడంతో..

బీజింగ్: చైనాలోని హుబై ప్రావిన్స్‌లో కుండపోత వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడడంతో 9 మంది సజీవ సమాధి అయ్యారు. హువాంగ్మీ కౌంటీలోని దాహే టౌన్షిప్లో ఇవాళ తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు స్థానిక వరద నియంత్రణ, కరువు సహాయక విభాగం వెల్లడించినట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ప్రస్తుతం ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపింది. అత్యవసర సహాయక సిబ్బంది, ప్రజా భద్రతా సిబ్బంది, సాయుధ పోలీసు బలగాలు, వైద్యఆరోగ్య శాఖ సహా పలు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.