‘కరోనా’ వార్డు నుంచి హఠాత్తుగా మహిళ అదృశ్యం!

ABN , First Publish Date - 2020-03-28T17:16:33+05:30 IST

‘కరోనా’ వార్డులో చికిత్స పొందుతూ హఠాత్తుగా అదృశ్యమైన

‘కరోనా’ వార్డు నుంచి హఠాత్తుగా మహిళ అదృశ్యం!

చెన్నై : కోవై ప్రభుత్వాసుపత్రిలో ‘కరోనా’ వార్డులో చికిత్స పొందుతూ హఠాత్తుగా అదృశ్యమైన మహిళను పోలీసులు పట్టుకుని మళ్లీ ఆస్పత్రికి తరలించిన ఘటన కలకలం రేపింది. కోవై ఈఎ్‌సఐ ఆసుపత్రిలో   ప్రత్యేక వార్డులో  30 మంది పరిశీలనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, పరిశీలన వార్డులో ఉన్న ఓ మహిళ హఠాత్తుగా శుక్రవారం ఉదయం అదృశ్యమైంది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది సింగానల్లూర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో వారు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పట్టణం మొత్తం గాలించి ఓ బస్టాండ్‌లో ఉన్న ఆ మహిళను గుర్తించి, ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2020-03-28T17:16:33+05:30 IST