చైనాతో ఘర్షణలో గాయపడి కోలుకుంటోన్న 58 మంది భారత సైనికులు
ABN , First Publish Date - 2020-06-19T04:01:31+05:30 IST
లేహ్: లడక్ గల్వాన్ లోయ ఘర్షణలో గాయపడ్డ భారత సైనికులు కోలుకుంటున్నారు. లేహ్ ఆసుపత్రిలో వీరంతా చికిత్స పొందుతున్నారు.
లేహ్: లడక్ గల్వాన్ లోయ ఘర్షణలో గాయపడ్డ భారత సైనికులు కోలుకుంటున్నారు. లేహ్ ఆసుపత్రిలో వీరంతా చికిత్స పొందుతున్నారు. మొత్తం 58 మంది చికిత్స పొందుతుండగా 18 మంది పరిస్థితి తొలుత ఆందోళనకరంగా ఉన్నట్లు వార్తలందాయి. అయితే ఆ 18 మంది కూడా పూర్తి స్థాయిలో కోలుకుంటున్నారని సైనిక వర్గాల ద్వారా తెలిసింది.
ఈ నెల 15న లడక్ గల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖను దాటడంతో పాటు అక్కడ టెంట్లు వేసుకుని గోడ నిర్మించేందుకు యత్నించిన చైనా బలగాలను భారత బలగాలు అడ్డుకున్నాయి. దీంతో ముందే సిద్ధం చేసుకున్న లాఠీలు, రాడ్లు, రాళ్లతో చైనా బలగాలు భారత జవాన్లపై దాడికి దిగాయి. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు చనిపోయారు. 43 మంది చైనా సైనికులు చనిపోయారని కథనాలు వస్తున్నా చైనా ధృవీకరించడం లేదు.