కుషినగర్ విమానాశ్రయం అభివృద్ధి బీఎస్పీ కృషి: మాయావతి
ABN , First Publish Date - 2020-06-26T00:08:52+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లో కుషినగర్ విమానాశ్రయం అభివృద్ధి బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రారంభమైందని ఆ పార్టీ సుప్రెమో మాయావతి అన్నారు. సుదీర్ఘకాలంగా ఎదురు చూపుల తర్వాత కుషినగర్

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో కుషినగర్ విమానాశ్రయం అభివృద్ధి బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రారంభమైందని ఆ పార్టీ సుప్రెమో మాయావతి అన్నారు. సుదీర్ఘకాలంగా ఎదురు చూపుల తర్వాత కుషినగర్ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా రావడం రాష్ట్రానికి మంచి విషయమని ఆమె అన్నారు. ఈ విషయమై ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు.
‘‘సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నాం. ఇన్నేళ్లకు కుషినగర్ విమానాశ్రయం అంతర్జాతీయ హోదాను పొందింది. ఇది యుపికి మంచి విషయం. ఎందుకంటే బౌద్ధ సర్క్యూట్ కింద పిపిపి మోడల్‌పై కుషినగర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి బిఎస్పి పాలనలోనే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి కుషినగర్ విమానాశ్రయ అభివృద్ధి ఘనత బీఎస్పీదే’’ అని మాయావతి ట్వీట్ చేశారు.