సాగు ఉత్పత్తుల రవాణాకు కృషీ రథ్‌ యాప్‌

ABN , First Publish Date - 2020-04-18T07:34:46+05:30 IST

లాక్‌డౌన్‌ కాలంలో యాసంగి పంట చేతికొచ్చిన రైతన్నలకు గొప్ప ఊరట. తమ వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసే క్రమంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కేంద్ర

సాగు ఉత్పత్తుల రవాణాకు కృషీ రథ్‌ యాప్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కాలంలో యాసంగి పంట చేతికొచ్చిన రైతన్నలకు గొప్ప ఊరట. తమ వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసే క్రమంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభు త్వం ప్రత్యేకంగా ఓ మొబైల్‌ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ పేరు ‘‘కృషీ రథ్‌’’. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ శుక్రవారం దీనిని విడుదల చేశారు. సాగు ఉత్పత్తులను తరలించేందుకు అవసరమైన వాహనాలను యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. యాప్‌ను ఉపయోగించుకొని అంతర్రాష్ట్ర మండీలకు రైతులు తమ ఉత్పత్తులను తరలింవచ్చునని తోమర్‌ చెప్పారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత రైతులు తమ పంట రకం, పరిమాణం వివరాలను పొందుపర్చాలి. దీన్ని అధికారులు ధ్రువీకరించుకొని.. రైతులకు వ్యాపారులు, రవాణాదారులు, మార్కెట్‌ వివరాలను పంపుతారు. ఆ మేరకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా మండీలకు సాగు ఉత్పత్తులను రవాణా చేసుకోవచ్చు. 

Updated Date - 2020-04-18T07:34:46+05:30 IST