150 మంది డాక్ట‌ర్ల‌కు కోవిడ్ వైద్యంలో శిక్ష‌ణ‌

ABN , First Publish Date - 2020-05-17T15:48:35+05:30 IST

దేశంలోని ప్ర‌భుత్వ ఆరోగ్య విభాగాలు నిత్యం ప్రైవేటు వైద్యులకు శిక్షణ ఇస్తున్నాయి. తద్వారా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న

150 మంది డాక్ట‌ర్ల‌కు కోవిడ్ వైద్యంలో శిక్ష‌ణ‌

ఘజియాబాద్: దేశంలోని ప్ర‌భుత్వ ఆరోగ్య విభాగాలు నిత్యం ప్రైవేటు వైద్యులకు శిక్షణ ఇస్తున్నాయి. తద్వారా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందవచ్చు. ఈ విధంగా యూపీలో ఇప్పటివరకు 150 మందికి పైగా వైద్యులు శిక్షణ పొందారు. ఈ నివేదికను  ప్రభుత్వానికి పంపారు. యూపీలోని ఘ‌జియాబాద్ జిల్లాలో ప్రైవేట్ వైద్యులకు శిక్షణ అందించే కార్య‌క్ర‌మానికి డాక్టర్ మున్షిలాల్ ఆధ్వ‌ర్యం వ‌హిస్తున్నారు. డాక్టర్ మున్షిలాల్ తన బృందంతో కలిసి గత 15 రోజుల్లో 150 మందికి పైగా వైద్యులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ సమయంలో అత్యవసర పరిస్థితుల‌లో రోగుల విష‌యంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియ‌జేశారు. దీనితో పాటు పీపీఈ కిట్ ధరించి రోగులను పరీక్షించడం, చికిత్స చేయడంపై వైద్యుల‌కు శిక్ష‌ణ ఇచ్చారు. 

Updated Date - 2020-05-17T15:48:35+05:30 IST