కోతులపై కోవ్యాక్సిన్‌ విజయవంతం

ABN , First Publish Date - 2020-09-13T07:07:19+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ‘కోవ్యాక్సిన్‌’తో రేసుస్‌ జాతి కోతులపై జరిపిన ‘చాలెంజ్‌ ప్రయోగ పరీక్ష’ల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి.

కోతులపై కోవ్యాక్సిన్‌ విజయవంతం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ‘కోవ్యాక్సిన్‌’తో రేసుస్‌ జాతి కోతులపై జరిపిన ‘చాలెంజ్‌ ప్రయోగ పరీక్ష’ల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. శ్వాసకోశ వ్యవస్థలో భారీ మోతాదులో వైరల్‌ లోడ్‌ను కలిగిన కోతుల్లోనూ వ్యాధి నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం లో వ్యాక్సిన్‌ విజయం సాధించిందని కంపెనీ వెల్లడించింది. ఫలితంగా ఆ వానరాలు ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకోగలిగాయని తెలిపింది. ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను భారత్‌ బయోటెక్‌ విడుదల చేసింది. కోతులపై నిర్వహించింది చాలెంజ్‌ ట్రయల్‌. ఇందులో వానరాలకు ముందు గా కోవ్యాక్సిన్‌ ఇచ్చి, ఆ తర్వాత వైరస్‌ సోకేలా చేశారు. ఇలా 20 కోతులను 5 చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపులోని వాటికి ప్లేస్‌ బో(డమ్మీ) చికిత్స అందించగా, మిగ తా 3 గ్రూపుల్లోని కోతులపై 14 రోజులపాటు వివిధ రకాల కోవ్యాక్సిన్‌ కేండిడేట్లను పరీక్షించారు. అయితే కోతులన్నింటిలోనూ వ్యాక్సిన్‌ రెండో డోసు వేసిన 2 వారాల తర్వాత రోగ నిరోధక వ్యవస్థ క్రియాశీలమైనట్లు గుర్తించారు. కరోనాను నిర్వీర్యం చేసే ఐజీజీ, న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలు భారీ సంఖ్యలో విడుదలై ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల కణజాలాల్లో వైరస్‌ సంఖ్య పెరగకుండా అడ్డుకట్ట వేశాయని తెలిపారు.

Updated Date - 2020-09-13T07:07:19+05:30 IST