ఏవియేషన్ మ్యాప్ ‌నుంచి మాయం కాబోతున్న కోల్‌కతా

ABN , First Publish Date - 2020-05-25T03:40:16+05:30 IST

దేశ వ్యాప్త అష్ట దిగ్బంధనం నిబంధనల సడలింపుతో, దేశీయ వైమానిక

ఏవియేషన్ మ్యాప్ ‌నుంచి మాయం కాబోతున్న కోల్‌కతా

కోల్‌కతా : దేశ వ్యాప్త అష్ట దిగ్బంధనం నిబంధనల సడలింపుతో, దేశీయ వైమానిక సేవలు ఈ నెల 25 నుంచి పునఃప్రారంభమవుతున్నప్పటికీ, కోల్‌కతా విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకల  సందడి దాదాపు రెండు రోజులపాటుకనిపించదు. అంఫన్ తుపాను బీభత్సం వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిమగ్నమైంది. 


కోల్‌కతా విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అంఫన్ తుపాను బీభత్సం వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిమగ్నమైంది. కోల్‌కతా విమానాశ్రయం నుంచి వైమానిక సేవల పునరుద్దరణను వాయిదా వేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరింది. ఈ నేపథ్యంలో కోల్‌కతా విమానాశ్రయం నుంచి ఈ నెల 28 నుంచి దేశీయ  వైమానిక సేవలు పునఃప్రారంభమవుతాయి. 


ఈ నెల 20న అంఫన్ తుపాను పశ్చిమ బెంగాల్‌లో బీభత్సం సృష్టించింది. కోల్‌కతా విమానాశ్రయం కూడా పాక్షికంగా వరద నీటిలో చిక్కుకుంది. 


Updated Date - 2020-05-25T03:40:16+05:30 IST