నాప్‌కిన్లకు... ఎక్కువ ధర పెట్టొద్దు

ABN , First Publish Date - 2020-06-19T22:42:03+05:30 IST

లాక్ డౌన్ సమయంలో మహిళలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో... కేంద్ర ప్రభుత్వం చౌక ధరకే నాప్‌కిన్లను అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన్ మంత్రి భారతీయ జన్‌ఔషధి కేంద్రాల ద్వారా వీటిని తీసుకోవచ్చు. మార్కెట్ ధర కన్నా వీటి ధర చాలా తక్కువగా ఉంటుంది. కేవలంరూపాయికే వీటిని కొనుగోలు చేయొచ్చు.

నాప్‌కిన్లకు... ఎక్కువ ధర పెట్టొద్దు

న్యూఢిల్లీ : లాక్ డౌన్ సమయంలో మహిళలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో... కేంద్ర ప్రభుత్వం చౌక ధరకే నాప్‌కిన్లను అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన్ మంత్రి భారతీయ జన్‌ఔషధి కేంద్రాల ద్వారా వీటిని తీసుకోవచ్చు. మార్కెట్ ధర కన్నా వీటి ధర చాలా తక్కువగా ఉంటుంది.  కేవలంరూపాయికే వీటిని కొనుగోలు చేయొచ్చు.


అదే మార్కెట్‌లోనైతే వీటి ధర ధర రూ. 8 వరకు ఉంటుంది. కానీ జస్ఔషధి కేంద్రాల్లో మాత్రం రూపాయికే కొనుక్కోవచ్చు. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంలో మహిళలు ఇబ్బంది పడుతున్న విషయం లిసిందే. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఎక్కువ ఇబ్బందలెదురవుతున్నాయని కేంద్రం భావించింది. ఈ క్రమంలోనే... జన్‌ఔషధి సెంటర్లకు వెళ్లి న్యాప్కిన్స్‌ను రూపాయికే నాప్‌కిన్‌లను కొనుగోలు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.


వాస్తవానికి 2018 లోనే ఈ సదుపాయం అందుబాటులోకొచ్చింది. అయితే వివిధ కారణాల నేపధ్యంలో ఇది అంతగా ఫలించలేదు. దీంతో... కేంద్రం తాజాగా మరోమారు ఇందుకు సంబంధించిన ప్రయత్నం చేస్తోంది. 

Updated Date - 2020-06-19T22:42:03+05:30 IST