నడ్డా పిలుపివ్వడమే ఆలస్యం.... వెంటనే ఆచరించి చూపిన కేంద్రమంత్రి

ABN , First Publish Date - 2020-03-28T23:56:46+05:30 IST

కరోనాను ఎదుర్కోవడానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్థానిక సంస్థల అభివృద్ధి నిధుల నుంచి కోటి రూపాయలను

నడ్డా పిలుపివ్వడమే ఆలస్యం.... వెంటనే ఆచరించి చూపిన కేంద్రమంత్రి

న్యూఢిల్లీ : కరోనాను ఎదుర్కోవడానికి కేంద్ర మంత్రి  కిరణ్ రిజిజు స్థానిక సంస్థల అభివృద్ధి నిధుల నుంచి కోటి రూపాయలను శనివారం విరాళంగా ప్రకటించారు. మిగితా ఎంపీలందరూ వెంటనే విరాళంగా ప్రకటించాలని రిజిజు పిలుపునిచ్చారు. బీజేపీ పార్లమెంట్ సభ్యులందరు కూడా కరోనాను ఎదుర్కోడానికి స్థానిక సంస్థల అభివృద్ధి నిధుల నుంచి కోటి రూపాయలను విరాళంగా ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. నడ్డా పిలుపివ్వగానే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ‘‘ఇప్పుడే నేను డిపాజిట్ చేస్తున్నాను’’ అని వెంటనే ట్వీట్ చేశారు. ఇలాగే కొన్ని రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.

Updated Date - 2020-03-28T23:56:46+05:30 IST