ఆవును చంపితే ఏడేళ్ల జైలు శిక్ష

ABN , First Publish Date - 2020-12-10T07:26:17+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాలు మరింత కఠినం కానున్నాయి. శాసనసభలో బుధవారం గోవధ

ఆవును చంపితే ఏడేళ్ల జైలు శిక్ష

బిల్లుకు కర్ణాటక శాసనసభ ఆమోదం 

బెంగళూరు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాలు మరింత కఠినం కానున్నాయి. శాసనసభలో బుధవారం గోవధ నిషేధ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై తొలుత ప్రసంగించిన పశుసం వర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్‌ గోసంతతని రక్షించేందుకు ఈ బిల్లును ఉద్దే శించామన్నారు.

గోవధకు పాల్పడినట్టు రుజువైతే 3 నుంచి 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష ఉంటుందన్నారు. రూ.5 వేల నుంచి 3 లక్షల వరకు జరిమానా విధిస్తారన్నారు. ఈ కొత్త చట్టాల ప్రకారం గోవధకు పాల్పడితే నాన్‌ బెయిలబుల్‌ కేసు దాఖలు చేస్తారన్నారు.  


Updated Date - 2020-12-10T07:26:17+05:30 IST