బాలికను అపహరించి చంపేశాడు
ABN , First Publish Date - 2020-10-07T08:18:07+05:30 IST
ఒక బాలికను అపహరించి దారుణంగా హత్య చేసిన ఒక మృగాడికి ఢిల్లీ కోర్టు మరణశిక్ష విధించింది. 2009 మార్చి 18న తన ఇంటి పక్కన ఉండే 11ఏళ్ల బాలికను జీవక్ నాగ్‌పాల్ అనే వ్యక్తి అపహరించారు...

- మరణ శిక్ష విధించిన కోర్టు
న్యూఢిల్లీ, అక్టోబరు 6: ఒక బాలికను అపహరించి దారుణంగా హత్య చేసిన ఒక మృగాడికి ఢిల్లీ కోర్టు మరణశిక్ష విధించింది. 2009 మార్చి 18న తన ఇంటి పక్కన ఉండే 11ఏళ్ల బాలికను జీవక్ నాగ్‌పాల్ అనే వ్యక్తి అపహరించారు. డబ్బులిస్తేనే వదిలిపెడతానని బాలిక తండ్రికి మెసేజ్‌లు పెట్టాడు. డబ్బులు అందకపోవడంతో ఆ బాలికను తన కారు జాకీతో విచక్షణారహితంగా కొట్టి చంపాడు. తర్వాత మృతదేహాన్ని ఓ డ్రైనులోకి విసిరేశాడు. ఈ నేరం అత్యంత క్రూరమైనదిగా అభిప్రాయపడిన జడ్జి.. నిందితుడికి బతికే అర్హత లేదని పేర్కొన్నారు.