బీజేపీతో రజినీ పార్టీ పొత్తు అవకాశాలపై కుష్బూ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-12-03T23:13:07+05:30 IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై ట్విట్టర్‌లో చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 31న పార్టీ పేరు, విధి విధానాలు ప్రకటించనున్న...

బీజేపీతో రజినీ పార్టీ పొత్తు అవకాశాలపై కుష్బూ కీలక వ్యాఖ్యలు

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై ట్విట్టర్‌లో చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 31న పార్టీ పేరు, విధి విధానాలు ప్రకటించనున్న రజినీ.. జనవరి, 2021లో తన రాజకీయ పార్టీ ఆవిర్భావం ఉండనున్నట్లు స్పష్టం చేయడంతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. రజినీ ఆధ్యాత్మిక రాజకీయాల పేరుతో రాజకీయాల్లోకి వచ్చినా.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే చర్చ మరోసారి తెరపైకొచ్చింది. ఈ ప్రచారంపై సినీ నటి, బీజేపీ నేత కుష్బూ సుందర్ స్పందించారు. బీజేపీతో కలిసి నడవాలని రజినీ కోరుకుంటే.. హృదయపూర్వకంగా స్వాగతిస్తామని కుష్బూ వ్యాఖ్యానించడం విశేషం.


రజినీ తటస్థంగా ఉన్న పక్షంలో పొత్తు కోసం బీజేపీ ఆయనను సంప్రదించే అవకాశముందా అన్న ప్రశ్నకు కుష్బూ స్పందిస్తూ.. ఈ విషయంలో కేంద్ర అధినాయకత్వందే తుది నిర్ణయమని చెప్పుకొచ్చారు. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు బలంగా ఉందని.. రజినీ తమతో కలిసి నడిచేందుకు సిద్ధమైతే స్వాగతిస్తామని కుష్బూ వ్యాఖ్యానించారు. అయితే.. రజినీ వచ్చే ఎన్నికల్లో సొంతంగానే ముందుకు వెళ్లే అవకాశం ఉందని కుష్బూ అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-12-03T23:13:07+05:30 IST