కరోనా అంటిస్తామని అక్కాతమ్ముడి బెదిరింపు

ABN , First Publish Date - 2020-05-17T07:45:27+05:30 IST

కరోనా వైరస్‌ అంటిస్తామని బెదిరించిన అక్కాతమ్ముడిపై మధ్యప్రదేశ్‌లోని ఖార్‌గోన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

కరోనా అంటిస్తామని అక్కాతమ్ముడి బెదిరింపు

ఖార్‌గోన్‌, మే 16: కరోనా వైరస్‌ అంటిస్తామని బెదిరించిన అక్కాతమ్ముడిపై మధ్యప్రదేశ్‌లోని ఖార్‌గోన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు అక్క చేసిన ఓ వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు చర్య తీసుకున్నారు. అరెస్టయిన అనంతరం ఆమె మరో వీడియో చేశారు. కొవిడ్‌-19 బాధితుడైన తమ తండ్రి గురించి పాత్రికేయులు తప్పుడు వార్తలు రాశారని, దీంతో నిరాశ, కోపం వల్లే ఇంతకుముందు అలా బెదిరించానని ఆమె చెప్పా రు. ఈ అక్కాతమ్ముడు చైనాలో వైద్యవిద్యను అభ్యసించారు. వీరి తల్లి కూడా కరోనా బారినపడ్డారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది.

Updated Date - 2020-05-17T07:45:27+05:30 IST