2 నెలల్లో 2 పాము కాట్లు.. మహిళ మృతి..దర్యాప్తులో షాకింగ్ విషయం వెల్లడి

ABN , First Publish Date - 2020-05-25T04:19:12+05:30 IST

రెండు నెలల్లో రెండు పాము కాట్లకు గురై మరణించిన కేరళ వివాహిత కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యయి.

2 నెలల్లో 2 పాము కాట్లు.. మహిళ మృతి..దర్యాప్తులో షాకింగ్ విషయం వెల్లడి

తిరువనంతపురం: రెండు నెలల్లో రెండు పాము కాట్లకు గురై మరణించిన కేరళ వివాహిత కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యయి. ఈ ఘటన వెనుక ఆమె భర్త హస్తం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. క్రైం థ్రిల్లర్‌కు మించిన ట్విస్టులు ఉన్న ఈ నేరం కొల్లమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహిళ మరణ పట్ల ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారి దర్యాప్తులో భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి. భార్యను చంపేందుకు భర్త పెద్ద కుట్రపన్ని..ఆమె పాటు పాటుకు గురయ్యేలా చేశాడని తెలిపారు. తొలి హత్యయత్నం విఫలమవడంతో ప్రాణాలతో బయటపడిన ఆమె తన తల్లిగారి ఇంట్లో ఉంటూ కోలుకుంటోంది. ఆ సమయంలోనే భర్తపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే భార్యా తరఫు బంధువులపైనే అతడు నేరం మోపి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అతడు మళ్లీ తన ప్రయత్నాలకు పదును పెట్టాడు. స్థానికంగా పాములాడించే వ్యక్తి నుంచి నాగుపామును రూ. 10 వేలు తీసుకొచ్చి భార్య నిద్రించే గదిలో వదిలిపెట్టాడు. అయితే దురదృష్ట వశాత్తూ అది నాగు పాము కాటు కావడంతో ఆమె ప్రాణాలు కల్పోవాల్సి వచ్చింది. దీంతో పోలీసులు భర్తను అతడికి సహకరించిన వారిపైన హత్యనేరం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు భార్యను కట్నం కోసం తరచూ వేధించే వాడని మృతురాలి తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2020-05-25T04:19:12+05:30 IST