కరోనా డ్యాన్స్ చేస్తున్న పోలీసులు.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2020-03-18T21:51:30+05:30 IST

కేరళ పోలీసుల ఫన్నీ డ్యాన్స్ వైరల్ అవుతోంది. కరోనా వైరస్ ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలపై

కరోనా డ్యాన్స్ చేస్తున్న పోలీసులు.. వీడియో వైరల్

తిరువనంతపురం:  కేరళ పోలీసుల ఫన్నీ డ్యాన్స్ వైరల్ అవుతోంది. కరోనా వైరస్ ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తూ చేసిన డ్యాన్స్ అది. చేతులు కడుక్కోవలసిన ఆవశ్యకతను తెలియజేస్తూ పోలీసులు డ్యాన్స్ చేశారు. ముఖాలకు మాస్కులు తగిలించుకుని వారు చేసిన డ్యాన్స్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. 


త్వరితగతిన విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను నిరోధించడంలో చేతులు కడుక్కోవడం అత్యంత ముఖ్యం. సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడంతో పాటు .. తుమ్మినా, దగ్గినా జేబురుమాలు అడ్డంగా పెట్టుకోవడం చేయాలని డాక్టర్లు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. Updated Date - 2020-03-18T21:51:30+05:30 IST