కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిని ఇలా సాగనంపారు!

ABN , First Publish Date - 2020-04-05T17:33:19+05:30 IST

ఓవైపు రోజురోజుకీ కరోనా వ్యాధి సోకిన వారి సంఖ్య పెరిగిపోతూ యావత్ ప్రపంచాన్ని భయపెడుతుంటే.. మరోవైపు ఆ వ్యాధిపై పోరాడి గెలుస్తూ.. ఎందరిలో

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిని ఇలా సాగనంపారు!

తిరువనంతపురం: ఓవైపు రోజురోజుకీ కరోనా వ్యాధి సోకిన వారి సంఖ్య పెరిగిపోతూ యావత్ ప్రపంచాన్ని భయపెడుతుంటే.. మరోవైపు ఆ వ్యాధిపై పోరాడి గెలుస్తూ.. మిగిలిన వారికి జీవితంపై మళ్లీ ఆశలు పుట్టేలా చేస్తున్నారు. కేరళ సహకార, పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తాజాగా ట్వీట్ చేసిన వీడియోలో ఉన్న ఈ వ్యక్తి కూడా ఈ కోవకి చెందినవాడే.


‘‘ఒక్కరు కోలుకున్నా అది ఘన విజయమే’’ అంటూ ఆ వీడియోకి ఆయన క్యాప్షన్ పెట్టారు. సదరు వ్యక్తి మధ్యలో ఉంటే ఆస్పత్రి సిబ్బంది ఇరు వైపుల నిలుచొని చప్పట్లు కొట్టడం మనం ఈ వీడియోలో చూడొచ్చు.‘‘ఈ వ్యక్తి కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. రోగులు, వైద్య సిబ్బంది ఎంతో ఉత్సాహంగా చప్పట్లతో అతన్ని సాగనంపారు. ఈ ఘటన కేరళలోని కసర్‌గోడ్‌లోని ప్రభుత్వాస్పత్రిలో జరిగింది’’ అని ఆయన పేర్కొన్నారు. కొంత సమయంలోనే ఈ వీడియోని 5,300 మంది వీక్షించారు. ఇంకా ఆ సంఖ్య పెరుగుతునే ఉంది.


ఇది చూసిన నెటిజన్ల కామెంట్ల రూపంలో ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. ‘‘ఇలాంటివి చూడటం ఎంతో సంతోషంగా ఉంది’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. ‘‘త్వరలోనే మళ్లీ మామూలు రోజులు వస్తాయనే నమ్మకం వచ్చింది’’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. కేరళలో కసర్‌గోడ్‌ కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. రాష్ట్రంలో ఉన్న కేసుల్లో సగానికి పైగా ఈ ప్రాంతానికి చెందినవే. అలాంటి ప్రాంతంలో ఓ వ్యక్తి కరోనా వ్యాధి నుంచి కోలుకోవడం నిజంగా చాలా గొప్ప విషయమని నెటిజన్లు అంటున్నారు. 



Updated Date - 2020-04-05T17:33:19+05:30 IST