మద్యంపై అమ్మకం పన్ను పెంపు

ABN , First Publish Date - 2020-05-14T01:06:23+05:30 IST

బీరు, వైన్‌పై 10 శాతం అమ్మకం పన్ను పెంచగా, ఇతర రకాల మద్యంపై 35 శాతం పన్ను పెంచింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆదాయ మార్గాల..

మద్యంపై అమ్మకం పన్ను పెంపు

తిరువనంతపురం: మద్యంపై అమ్మకం పన్ను పెంచుతూ కేరళ మంత్రివర్గం బుధవారంనాడు నిర్ణయం తీసుకుంది. బీరు, వైన్‌పై 10 శాతం అమ్మకం పన్ను పెంచగా, ఇతర రకాల మద్యంపై 35 శాతం పన్ను పెంచింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆదాయ మార్గాల కోసం మద్యంపై అమ్మకం పన్ను పెంచాలని మంత్రివర్గం నిర్ణయించిందని, దీనిపై ఆర్డినెన్స్ జారీచేయలని గవర్నర్‌కు ప్రభుత్వం సిఫారసు చేసింది.


'లాక్‌డౌన్ కారణంగా ప్రధానమైన ఆదాయ వనరులపై తీవ్ర ప్రభావం పడింది. వచ్చే ఆదాయం బాగా పడిపోయింది. ఆదాయం పెంచుకునే మార్గంలో ఒకటిగా తాజా పెంపు నిర్ణయం తీసుకున్నాం' అని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.


కాగా, రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డుల్లో ఖర్చు తగ్గించాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు చేసేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా కేరళ మంత్రివర్గం తాజాగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల పునరుద్ధరణకు ప్రత్యేక ప్యాకేజీకి సైతం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీ ద్వారా రూ.3,434 కోట్ల సాయం అందించనుంది. కోవిడ్-19 నేపథ్యంలో ఈ రిలీఫ్ ప్యాకేజీ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2020-05-14T01:06:23+05:30 IST