‘నిజాముద్దీన్ మర్కజ్’ దేశ వ్యతిరేక చర్య : కేరళ గవర్నర్

ABN , First Publish Date - 2020-04-02T00:54:58+05:30 IST

‘నిజాముద్దీన్ మర్కజ్’ లో తబ్లీగ్ -ఎ - జమాత్ నిర్వహించిన సమావేశంపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్

‘నిజాముద్దీన్ మర్కజ్’ దేశ వ్యతిరేక చర్య : కేరళ గవర్నర్

తిరువనంతపురం : ‘నిజాముద్దీన్ మర్కజ్’ లో తబ్లీగ్ -ఎ - జమాత్ నిర్వహించిన సమావేశంపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మర్కజ్ సదస్సు అత్యంత హేయమైనదని తీవ్రంగా మండిపడ్డారు. ఆ సమావేశాలు దేశ వ్యతిరేక చర్యనే కాకుండా మానవత్వానికి కూడా వ్యతిరేకమని తీవ్రంగా ఆక్షేపించారు. మర్కజ్‌లో చేసిన ప్రసంగాలు కూడా నేరపూరితమైనవిగా ఆయన అభివర్ణించారు. కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీ సామాజిక దూరం పాటించాలన్న పిలుపును కుట్రపూరితమంటూ సదస్సులో అభివర్ణించారని ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీవ్రంగా మండిపడ్డారు.

Updated Date - 2020-04-02T00:54:58+05:30 IST