కేరళలో తగ్గినట్టే తగ్గి మళ్లీ సెంచరీ కొట్టిన కరోనా

ABN , First Publish Date - 2020-05-17T23:36:27+05:30 IST

కేరళలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం కొత్తగా...

కేరళలో తగ్గినట్టే తగ్గి మళ్లీ సెంచరీ కొట్టిన కరోనా

తిరువనంతపురం: కేరళలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ 14 కరోనా పాజిటివ్ కేసుల్లో 10 మంది ఇతర రాష్ట్రాల నుంచి కేరళకు వచ్చిన వారుగా అధికారులు గుర్తించారు. వీరిలో ఏడుగురు తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వారుగా తెలిపారు. యూఏఈ, కువైట్, మాల్దీవుల నుంచి తిరిగొచ్చిన ముగ్గురికి కూడా కరోనా పాజిటివ్‌గా తేల్చారు. కొల్లాంలో ఓ హెల్త్ వర్కర్‌కు కరోనా సోకింది. ఆదివారం కొత్తగా కేరళలో డిశ్చార్జ్‌లేవీ లేకపోవడం గమనార్హం. దీంతో.. కేరళలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 101కు చేరింది.

Updated Date - 2020-05-17T23:36:27+05:30 IST