మొసలిని కాపాడి నదిలో వదిలిన గ్రామస్థులు

ABN , First Publish Date - 2020-12-10T11:29:46+05:30 IST

ఓ ఇంట్లోకి అనుకోని అతిథిగా మొసలి రావడంతో గ్రామస్థులు దాన్ని రక్షించి నదిలో వదిలివేసిన ఘటన....

మొసలిని కాపాడి నదిలో వదిలిన గ్రామస్థులు

త్రిస్సూర్ (కేరళ): ఓ ఇంట్లోకి అనుకోని అతిథిగా మొసలి రావడంతో గ్రామస్థులు దాన్ని రక్షించి నదిలో వదిలివేసిన ఘటన కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాలో వెలుగుచూసింది. త్రిస్సూర్ జిల్లాలోని అథిరాప్పిలి ప్రాంతంలోని ఓ ఇంట్లోకి మొసలి ప్రవేశించింది. భవయపడిన గ్రామస్థులు మొసలిని బంధించి దాన్ని క్షేమంగా సమీపంలోని నదిలో వదిలివేశారు. గతంలోనూ గుజరాత్ రాష్ట్రంలోని వడోదర జిల్లా మంజల్ పూర్ ప్రాంతంలో 8 అడుగుల మొసలి వచ్చింది. ప్రజలు దాన్ని కూడా కాపాడి నదిలో వదిలారు. పులులే కాకుండా మొసళ్లు కూడా గ్రామాల్లోకి ప్రవేశిస్తుండటంతో నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-12-10T11:29:46+05:30 IST