15 నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో పాక్టికల్స్
ABN , First Publish Date - 2020-12-13T16:21:21+05:30 IST
కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రాల సమ్మతితో...

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రాల సమ్మతితో 10వ, 12వ తరగతుల విద్యార్థులకు ఈనెల 15 నుంచి ప్రాక్టికల్ తరగతులు నిర్వహించేందుకు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందుకోసం కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. దీని ప్రకారం విద్యార్థులను చిన్న చిన్న గ్రూపులుగా పాఠశాలకు పిలవనున్నారు.
వారికి ప్రాక్టికల్ తరగతులు నిర్వహించనున్నారు. బోర్డు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు ఇంతవరకూ ప్రాక్టికల్ తరగతులు నిర్వహించలేదు. సాధారణంగా బోర్డు పరీక్షల్లో థీరీతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించి వారికి మార్కులు వేస్తుంటారు. థీరీకి 70 మార్కులు, ప్రాక్టికల్‌కు 30 మార్కులు ఉంటాయి. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడిన నేపధ్యంలో ప్రస్తుతం విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకే ఇప్పుడు పలు నిబంధనలతో ప్రాక్టికల్ తరగతులు నిర్వహించాలని కేంద్రీయ విద్యాలయ అధికారులు నిర్ణయించారు.