ఢిల్లీ ఎంపీలతో సీఎం కేజ్రీవాల్ వీడియో కాన్ఫెరెన్స్

ABN , First Publish Date - 2020-04-08T22:14:11+05:30 IST

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఢిల్లీ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ

ఢిల్లీ ఎంపీలతో సీఎం కేజ్రీవాల్ వీడియో కాన్ఫెరెన్స్

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఢిల్లీ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలతో పాటు ఆమ్‌ఆద్మీ రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. ‘‘మనమందరమూ కలిసి పోరాడాల్సిన సమయం ఇదీ....’’ అని కేజ్రీవాల్ వారితో విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనా వ్యాప్తి గురించి చర్చించాం. కొందరు ఎంపీలు చాలా అద్భుతమైన సలహాలు, సూచనలు చేశారు. వాటిని తొందర్లోనే అమలు చేస్తాం. ఈ సమయంలో అందరం కలిసి కట్టుగా పోరాడాలి’’ అని హిందీలో కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.


ఇప్పటి వరకూ దేశ రాజధానిలో 576 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 51 కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అందరి సలహాలూ స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. 


Updated Date - 2020-04-08T22:14:11+05:30 IST