లాక్‌డౌన్ ఉన్నా... బడ్జెట్ ప్రవేశపెడతాం : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-03-23T19:16:32+05:30 IST

ఓ వైపు దేశమంతా కరోనా వైరస్ విజృంభిస్తున్నా, ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటించినా అసెంబ్లీలో మాత్రం బడ్జెట్‌ను

లాక్‌డౌన్ ఉన్నా... బడ్జెట్ ప్రవేశపెడతాం : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : ఓ వైపు దేశమంతా కరోనా వైరస్ విజృంభిస్తున్నా, ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటించినా అసెంబ్లీలో మాత్రం బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ప్రకటించారు. ‘‘నేడు (సోమవారం) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతాం. లాక్‌డౌన్ ఉన్నా సరే, రాష్ట్రానికి ఇది అవసరం. ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్ ఖర్చు చేయాలంటే అసెంబ్లీ ఆమోదం తప్పని సరి కదా.’’ అని కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


మరోవైపు లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలందరూ తమ తమ ఇళ్లల్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప, బయటికి రాకూడదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బ్రిజ్ విజ్ఞప్తి చేశారు. ‘‘సోమవారం నుంచి ఢిల్లీలో లాక్‌డౌన్. అత్యవసరం అయితేనే బయటికి రండి. దీంతో మీరూ క్షేమంగా ఉంటారు. ఇతరులూ క్షేమంగా ఉంటారు. అలర్ట్‌గా ఉండండి... ఆరోగ్యంగా ఉండండి’’ అని అనిల్ బ్రిజ్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-03-23T19:16:32+05:30 IST