'ఆప్' శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-02-12T20:00:03+05:30 IST

కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను ఏకగ్రీవంగా సీఎల్‌పీ నేతగా ఎన్నుకున్నారు. ఈనెల 16న రామ్‌లీలా..

'ఆప్' శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారంనాడు ఎన్నికయ్యారు. కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను ఏకగ్రీవంగా సీఎల్‌పీ నేతగా ఎన్నుకున్నారు. ఈనెల 16న రామ్‌లీలా మైదానంలో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేయనుండటం ఇది వరుసగా మూడోసారి.


కేజ్రీవాల్‌తో పాటు మొత్తం కేబినెట్ సభ్యులంతా రామ్‌లీలా గ్రౌండ్స్‌లో ప్రమాణస్వీకారం చేస్తారని, 16వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని 'ఆప్' సీనియర్ నేత మనీష్ సిసోడియా తెలిపారు. కేజ్రీవాల్ పరంగా రామ్‌లీలా గ్రౌండ్స్‌కు ప్రత్యేకత ఉంది. ఇదే మైదానంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇంతకుముందు రెండు సార్లు కూడా ముఖ్యమంత్రిగా ఇదే గ్రౌండ్స్‌ నుంచి ఆయన ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారంనాడు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 70 స్థానాలకు గాను 62 స్థానాలను ఆప్ గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు ఖాతా తెరవకపోవడమే కాకుండా ఆ పార్టీకి చెందిన 62 మంది అభ్యర్థులు డిపాజిట్ సైతం కోల్పోయారు.

Updated Date - 2020-02-12T20:00:03+05:30 IST