లాక్‌డౌన్-4పై కేజ్రీవాల్ గైడ్‌లైన్స్

ABN , First Publish Date - 2020-05-18T23:56:23+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 4.0 అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొత్త మార్గదర్శకాలు..

లాక్‌డౌన్-4పై కేజ్రీవాల్ గైడ్‌లైన్స్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 4.0 అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొత్త మార్గదర్శకాలు ప్రకటించారు. బస్సుల్లోకి 20 మంది ప్రయాణికులకంటే అనుమతించమని, బస్సులోకి ఎక్కేముందు ప్రయాణికులను స్క్రీనింగ్ చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. బస్సుల్లోనూ, బస్సు స్టాప్‌ల వద్ద సామాజిక దూరం నిబంధనలను పాటించేలా రవాణా శాఖ చూడాలని అన్నారు.


టాక్సీలు, క్యాబ్‌లను అనుమతిస్తున్నామని, అయితే ఇద్దరు వ్యక్తులకే అనుమతి ఉంటుందన్నారు. ఆటో రిక్షాలు, ఇ-రిక్షాలు, సైకిల్ రిక్షాలను అనుమతిస్తున్నట్టు చెప్పారు. అయితే ఒక్క వ్యక్తికే ఇందులో అనుమతిస్తామన్నారు. ద్విచక్ర వాహనంపై ఒక్కరికే అనుమతి ఉంటుందని, కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఉండదని కేజ్రీవాల్ చెప్పారు.


భవన నిర్మాణ కార్యక్రమాలను అనుమతిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే, ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కార్మికులను మాత్రమే ఈ పనులకు అనుమతిస్తామని చెప్పారు. ప్రైవేటు కార్యాలయాలను పూర్తి స్టాఫ్‌తో తెరుచుకోవచ్చని, అయితే ఎక్కువ మంది స్టాఫ్‌ను ఇంటి నుంచే పని చేయించేందుకు ప్రయత్నించాలని సూచించారు. మార్కెట్లు తెరుచుకోవచ్చని, షాపులు మాత్రం సరి-బేజి విధానంలో తెరవాల్సి ఉంటుందని చెప్పారు. స్టోర్ట్స్ కాంప్లెక్సులు, స్టేడియంలు ప్రేక్షకులు లేకుండా తెరుచుకోవచ్చని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Updated Date - 2020-05-18T23:56:23+05:30 IST