8 మంది కజకిస్థానీలపై కేసు

ABN , First Publish Date - 2020-04-08T08:59:05+05:30 IST

తబ్లీగీ జమాత్‌ మర్కజ్‌ సమావేశం లో పాల్గొనేందుకు టూరిస్టు వీసాలపై ఢిల్లీ వచ్చి, అక్రమంగా కర్ణాటకలోని బీదర్‌లో తలదాచుకున్న 8 మంది కజకిస్థాన్‌ పౌరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

8 మంది కజకిస్థానీలపై కేసు

బెంగళూరు, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): తబ్లీగీ జమాత్‌ మర్కజ్‌ సమావేశం లో పాల్గొనేందుకు టూరిస్టు వీసాలపై ఢిల్లీ వచ్చి, అక్రమంగా కర్ణాటకలోని బీదర్‌లో తలదాచుకున్న 8 మంది కజకిస్థాన్‌ పౌరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మంగళవారం వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు.మర్కజ్‌ నుంచి వచ్చిన 10 మంది బీదర్‌వాసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వారితోపాటు కజకిస్థానీయులు రహస్యంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా, కర్ణాటకలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 175కు చేరింది. తమిళనాడులో పాజిటివ్‌ కేసుల సంఖ్య 690కి చేరింది. 

Updated Date - 2020-04-08T08:59:05+05:30 IST